Monday, December 23, 2024

నిజాం కాలేజీ విద్యార్థులపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీలో ప్రిన్సిపాల్ ఛాంబర్ ను విద్యార్థులు ముట్టడించారు.  నూతనంగా నిర్మించిన హాస్టల్ ను అండర్ గ్రాడ్యువేట్ గర్ల్స్ స్టూడెంట్స్ కు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు.పిజి విద్యార్థులకు విసి కేటాయించాలని ఆర్డర్స్ ఇచ్చారని ప్రిన్సిపాల్ చెప్పాడు. దూరప్రాంతాల నుండి వచ్చిన తమకు హాస్టల్ కేటాయించాలని ప్రిన్సిపాల్ ను విద్యార్థులు నిలదీశారు. ప్రిన్సిపాల్ ఛాంబర్ లో భైఠాయించిన విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. పోలీసులకు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులతో పోలీసుల దురుసు ప్రవర్తించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్యార్థినిలపై కొందరు పోలీసులు చెయి చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News