Friday, January 31, 2025

విద్యార్థులపై పోలీసుల దాడి సరికాదు: ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లిలో జరిగిన లాఠీ ఛార్జిని ఖండించిన విద్యార్థులు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ బాలికల జూనియర్ కళశాల సమస్యలు పరిష్కరించాలని దశలు వారిగా పెద్దపల్లిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న భారత విద్యార్ధి ఫెడరేషన్ నాయకులపై పోలీసులు దాడి చేయడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ ఖండించింది. గురువారం ఆసంఘం నాయకులు ఆర్.ఎల్.మూర్తి, నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బాలికల జూనియర్ కళాశాల బిల్డింగ్ శిథిలావస్థలలో ఉందని కనీసం మౌలిక వసతులు లేక అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పలుమారు కళాశాల సమస్యలపై ప్రజాప్రతినిధులు,అధికారులు దృష్టికి తీసుకెళ్లిన కనీసం స్పందించకుండా సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్షం చేస్తున్నారని మండిపడ్డారు. జూనియర్ కళాశాలను కూల్చివేసి అదే స్థలంలో జిల్లా గ్రంధాలయం కడుతామని భూమి పూజకు ఏర్పాట్లు చేశారని ఇక్కడ కాకుండా వేరే చోటకు గ్రంథాలయం తరలించాలని, పేద ,మధ్యతరగతి అమ్మాయిలు చదువుతున్న బాలికల కళాశాల ఇక్కడే నిర్మించాలని కోరారు. విద్యార్ధి నాయకులపై దాడి చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News