Wednesday, January 22, 2025

42 మంది యువతులతో అర్థ నగ్న నృత్యాలు… టాస్ పబ్‌పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 4లో టాస్ పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా యువతి, యువకులతో అర్థనగ్నంగా డ్యాన్స్ చేయిస్తున్నట్లు గుర్తించారు. పబ్‌కు కస్టమర్లను ఆకర్షించేందుకు 42 మంది యువతులతో నిర్వహకులు అసభ్యకరంగా డ్యాన్సులు చేయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు పబ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. వంది మంది పురుషులతో పాటు 42 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లకు యువతులను ఎరగా వేసి డబ్బులు గుంజుతున్నారు. కస్టమర్ల దగ్గరకు వెళ్లి డ్యాన్సులు చేస్తూ వారితో పాటు డ్యాన్సర్లు తాగుతున్నట్టు నటిస్తారు. డ్యాన్సర్లు కూల్ డ్రింక్స్ తాగి కస్టమర్లతో మద్యం తాగుతున్నట్టు నమ్మించి బోల్తాకొట్టిస్తారు. కస్టమర్ల బిల్లులోనే యువతుల బిల్లులను కలిసి కస్టమర్లను మోసం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News