Monday, December 23, 2024

బిల్డర్‌పై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ : ప్లాట్ ఇస్తానని చెప్పి రూ.31 లక్షలు తీసుకొ ని కులం పేరుతో దూషిస్తూ , బెదిరింపులకు పాల్పడుతున్న బిల్డర్ సోమూరి రాజేశ్‌కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాటసమితి రాష్ట్రాధ్యక్షుడు రేణుకుంట్ల ఎల్లయ్య డిమాండ్ చేశారు. శనివారం ఎన్‌ఎస్‌ఎస్ భవనం లో బాధితుడు కూతాడి కృష్ణ ఎరకలతో కలిపి విలేఖరులతో మాట్లాడారు. రి లయన్స్ బిల్డర్స్ పేరిట సోమూరి రాజేశ్ కిరణ్,తన కుటుంభ సభ్యులతో క లసి కన్‌స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాడని వెల్లడించారు. కొండాపూర్ నుందు త నకు త్రిబుల్ బెడ్ రూం ప్లాట్ చూపించి రూ.96 లక్షలకు ధర నిర్ణయించి కు తాడి కృష్ణ వద్ద నుండి విడతలవారీగా రూ.31 లక్షలు తీసుకున్నాడని తెలిపా రు.

ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయమని ఓనర్ కల్పనారెడ్డిని కోరగా ,బిల్డర్ తమకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారన్నారు. బిల్డర్‌ను తమ డబ్బులు ఇవ్వాలని నిలదీయగా తనను కులం పేరుతో దూషిస్తూ, ఐదు ఏండ్లుగా వేధిస్తున్నాడని వా పోయారు. తనకు పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలుసంటూ, త నను మీరు ఏమి చేయలేరని అంటున్నాడని ఆవేదన చెందారు. ఈ సమావేశంలో బిఎస్‌పి రాష్ట్ర నాయకులు బిర్రు యాకస్వామి,బీఆర్‌ఎస్ ఎస్సీసెల్ అ ధ్యక్షులు ఆనంద ప్రకాశ్,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం అధ్యక్షుడు కు తాడి కుమార్, తమిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.విష్ణు, మేడ్చల్ హ్యూమన్ రైట్ అధ్యక్షులు చెరుకు రమేష్, మాజీ సైనిక వెల్ఫేర్ అధ్యక్షులు కు తాడి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News