Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు

- Advertisement -
- Advertisement -

 

నిర్మల్ : నిర్మల్ జిల్లాలో గురువారం వశిష్ట డిగ్రీ కాలేజ్ లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సైకిల్ లిస్ట్ సంతోష్ మిశ్రా పాల్గొన్నారు. సంతోష్ మిస్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీద దేశం మొత్తం తిరుగుతూ యాక్సిడెంట్ ఫ్రీ ఇండియా చేయాలని ఉద్దేశంతో దాదాపు 21 సంవత్సరాల నుంచి రోడ్ సేప్టీ పైన అవగాహన సదస్సు నిర్వహిస్తూ వస్తున్నాడు. అందులోనే భాగంగా గురువారం నిర్మల్ జిల్లాలోని వశిష్ట డిగ్రీ కాలేజీలో రోడ్ సేప్టి పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సంతోష్ మిశ్రా మాట్లాడుతూ… యాక్సిడెంట్ కి గల కారణాలు, యాక్సిడెంట్ నివారణ చర్యల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ట్రాఫిక్ ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను, ట్రాఫిక్ రూల్స్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వశిష్ట డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అఖిలేష్ కుమార్ సింగ్, విద్యార్థులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News