న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లు సిరన దీక్ష చేస్తున్న జంతర్ మంతర్ వద్ద సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. నిరసనకారులకు సంఘీభావం ప్రకటించడానికి రైతు సంఘాల నాయకులు పోలీసుల బ్యారికేడ్లు పగులగొట్టి మరీ చొచ్చుకువెళ్లారు. లైంగిక దాడికి పాల్పడిన రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా రెజ్లర్లు గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేస్తున్నారు.
Also Read: మేడ్చల్‌లో దారుణ హత్య
కాగా..రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు కొంతమంది రైతు సంఘాల నాయకులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారని, హడావుడిగా వారు బ్యారికేడ్లు ఎక్కి మరీ లోపలకు వెళ్లారని న్యూఢిల్లీ డిసిపి ఒక ట్వీట్‌లో తెలిపారు. అయితే వారిని లోపలకు పంపించేందుకు పోలీసులు బ్యారికేడ్లను పక్కకు తొలగించారని ఆయన వివరించారు. ఇలా ఉండగా..భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ తియాత్, ఖాప్ మహామ్ 24 అధినేత మెహర్ సింగ్, సంకియత్ కిసాన్ మోర్చ అధినేత బల్దేవ్ సింగ్ సిర్సా ఆదివారం రెజ్లర్లను దీక్షాస్థలి వద్ద కలుసుకుని మీడియాతో మాట్లాడారు. రెజ్లర్లకు మద్దతుగా పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకునే అవకాశం ఉన్నందున పోలీసులు ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు చేపట్టారు.
Wrestlers Proter : Jantar Mantar 'ਤੇ ਕਿਸਾਨਾਂ ਨੇ ਤੋੜੇ Delhi Police ਦੇ ਬੈਰੀਕੇਡ । Punjab Tak#WrestlersProtest #Delhi #kisan #Punjab pic.twitter.com/LNsGS8XOQp
— Punjab Tak (@PunjabTak) May 8, 2023