Monday, December 23, 2024

కరుడుగట్టిన చైన్‌స్నాచర్ ను నగరానికి తీసుకు రానున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

Police bringing chain snatcher to Hyderabad

హైదరాబాద్ : మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ ఉమేష్‌ను పోలీసులు నగరానికి తీసుకురానున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వరుసగా ఆరు చైన్‌స్నాచింగ్‌లు చేసిన సంచలనం సృష్టించాడు. చైన్‌స్నాచింగ్‌లను సవాల్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు నిందితుడిని అహ్మదాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి కోసం అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు వెతుకుతున్నారు. సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న విషయం తెలుసుకుని అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితుడిపై కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో కేసులు ఉన్నాయి. చైన్‌స్నాచర్ ఉమేష్‌ను పిటి వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. 24 గంటల్లో ఆరు చోట్ల చైన్‌స్నాచింగ్ చేయడంతో పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించి ఉమేష్‌గా గుర్తించారు. నిందితుడు పారిపోయే మార్గలపై నిఘాపెట్టి సిసిటివిలను పరిశీలించగా గుజరాత్‌కు పారిపోయినట్లు గుర్తించారు. వెంటనే ప్రత్యేక టీములు అహ్మదాబాద్‌కు వెళ్లి అక్కడి పోలీసుల సాయంతో పట్టుకున్నారు. అహ్మదాబాద్ కోర్టులో హాజరుపర్చి నగరానికి తీసుకుని రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News