న్యూఢిల్లీ : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య తమ పనేనని కెనడాలో నివసిస్తున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో కలిసి తాము ఈ కుట్ర పన్నినట్టు పేర్కొన్నాడు. అయితే గోల్డీబ్రార్ వ్యాఖ్యలను లారెన్స్ బిష్ణోయ్ కొట్టి పారేశాడు. ఈ హత్యలో తన ప్రమేయం లేదని పేర్కొన్నాడు. పలు కేసుల్లో తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ … తనను కాపాడాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. విచారణ కోసం తనను పంజాబ్ పోలీసులకు అప్పగించవద్దని పాటియాలా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. ఒకవేళ అప్పగిస్తే పోలీసులు తనను నకిలీ ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపాడు. గోల్డీ ఆరోపణలను ఖండిస్తూ , ఇంతటి భారీ హత్య కుట్రను జైలులో నుంచి ఎలా ప్లాన్ చేస్తారని లారెన్స్ తరఫున పిటిషన్ వేసిన న్యాయవాది ప్రశ్నించారు.
పోలీసులు నన్ను చంపేస్తారు: గ్యాంగ్‌స్టర్ లారెన్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -