Monday, December 23, 2024

నాగర్‌కర్నూల్ పిఎస్‌లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంగళవారం కేసు నమోదు అయింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు అధ్యక్షుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ లపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మహబూబ్ నగర్ పోలీసులను గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News