Wednesday, January 22, 2025

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం.. బిగ్‌బాస్‌ విన్నర్ పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. ఆదివారం అర్థరాత్రి బిగ్ బాస్ షో వద్ద జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసుల విచారణ చేపట్టి.. సుమోటోగా కేస్ నమోదు చేశారు. సెక్షన్147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149ల కింద కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన పలువురు అభిమానులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

కాగా, బిగ్‌బాస్‌ షో విన్నర్ ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా చేరుకున్న విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానులు గొడవ పడ్డారు. ఇరువర్గాల దాడిలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. 6 ఆర్టీసి బస్సులు, ఓ పోలీస్‌ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ధ్వంసం కావడంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. సీసీఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి కేసు పెట్టారు. దాడులకు పాల్పడినవారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News