Friday, December 27, 2024

పవన్ కళ్యాణ్‌పై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్షంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు అందడంతో ఆయనపై ఐపిసి సెక్షన్ 336, 279, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 177 కింద కేసు నమోదైంది. తెనాలి మారిస్ పేటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.

ఈనెల 5న తాను తెనాలి నుంచి తాడేపల్లి వెళ్తుండగా జాతీయ రహదారిపై జనసేన నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్తున్నారని, ఆ గందరగోళంలో తాను వాహనం నుంచి కిందపడి గాయాల పాలయ్యాయనని శివకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ టిఎస్ 07 సిజి 2345 కారు టాప్‌పై కూర్చొని ఉండగా, మరికొందరు దానికి వేళాడుతూ కనిపించారని ఫిర్యాదు దారుడు తెలిపాడు. ఆయన కారు వెనుక మరికొన్ని వాహనాలు అత్యంత వేగంగా దూసుకెళ్ళడంతో ఆ వేగానికి తన బైకు అదుపుతప్పి కిందపడిపోయాని పేర్కొన్నాడు.

Police case filed on Pawan Kalyan for rash driving

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News