Wednesday, December 25, 2024

కూతురి పై తండ్రి అత్యాచారం..గర్భం దాల్చిన కూతురు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండల పరిధిలోని ఓ గ్రామం లో దుర్ఘటన చోటు చేసుకుంది. కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురి పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమనగల్ మండల పరిధిలోని ఓ గ్రామం లో తల్లిదండ్రులు పెద్ద కూతురితో కలిసి బతుకుదెరువు కోసం నాలుగు నెలల క్రితం దుండిగల్‌ వెళ్లాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. 14ఏళ్ల వయసున్న పెద్ద కూతురును చదువు మాన్పించి పనికి తీసుకెళ్లాడు. తల్లి లేని సమయంలో దుండిగల్ లో‌, సొంత గ్రామంలో బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. సంక్రాంతికి ఊరికి వచ్చిన బాలిక తండ్రి తనపై లైంగికదాడి చేస్తున్నాడని తల్లి, నాన్నమ్మలకు తెలిపింది. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చగా కుటుంబీకులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘట పై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News