Tuesday, December 24, 2024

‘అంతేరా’ రెస్టారెంట్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

కిచెన్ వ్యర్థాలు డ్రైనేజీలోకి వదులుతున్నారని కేసు

మనతెలంగాణ, సిటిబ్యూరోః కిచెన్‌లోని వ్యర్థాలను డ్రైనేజీలోకి వదులుతున్నారని జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… జూబ్లీహిల్స్‌లోని అంతేరా రెస్టారెంట్ సిబ్బంది కిచెన్ వ్యర్థాలు డ్రైనేజీలోకి వదులుతున్నారు. దీంతో మ్యాన్‌హోల్ పొంగడంతో బైక్‌ల మీద వెళ్తున్న వారు స్కిడ్ అయి కిందపడుతున్నారు. దీని వల్ల పలువురు బైక్‌పై వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

ఈ క్రమంలోనే శ్రీనగర్ కాలనీ, కమలాపూరి కాలనీకి చెందిన దీపిక అనే మహిళ బైక్‌పై వెళ్తుండగా స్కిడ్ అయి కిందపడింది. దీంతో దీపికకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. రెస్టారెంట్ వ్యర్థాలను రోడ్డుపైకి వదలడంతో తన బైక్ స్కిడ్ అయి కిందపడిపోయానని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు రెస్టారెంట్‌పై 336 ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News