Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదం… తల్లిదండ్రులతో పాటు కుమారుడిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డివైడర్ ను కారు ఢీకొట్టడంతో మైనర్ తో సహా తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు పక్కన డివైడర్ ను కీయా కారు ఢీకొట్టింది. ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన వ్యాపారి కుమారుడు కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపి యాక్సిడెంట్ చేసినట్లు తేలడంతో అతడి తల్లిదండ్రులు మీద కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రోడ్లు నిర్మానుష్యంగా మారడంతో  అత్యధిక వేగంతో కారు నడిపి డివైడర్ ను ఢీకొట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News