Friday, November 22, 2024

రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  జూబ్లీహిల్స్ ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లంబోర్గిని కారు ర్యాష్‌గా నడిపింది ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడం అని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎక్స్ ట్విటర్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై వీడియో పోస్ట్ చేశారు. దానిని గుర్తించిన పోలీసులు గుర్తించి కారును ర్యాష్‌గా డ్రైవింగ్ చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేశారు.

దీనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కారు రిచ్‌మౌంట్ వెంచర్స్ సంస్థ అధినేత కార్తికేయ మీద ఉన్నట్లు తేలింది. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు గాలిస్తుండగా కార్తికేయ దుబాయ్‌లో ఉన్నట్లు తెలిసింది. రెండు నెలల క్రితం కార్తికేయ కారును జూబ్లీహిల్స్ నుంచి బంజారాహిల్స్ వైపు నడిపినట్లు విచారణలో తెలిసింది. కార్తికేయపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News