Monday, December 23, 2024

ఢిల్లీ సాకేత్ కోర్టులో మహిళపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టు లోపల ఓ మహిళపై లాయర్ దుస్తులలో ఉన్న ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మహిళ గాయపడింది. దీనితో చాలా సేపటివరకూ న్యాయస్థానంలో భయాందోళనలు రేకెత్తాయి. పలువురు ఉరుకులు పరుగులతో బయటకు వెళ్లారు. ఈ ఘటన దేశ రాజధానిలో శాంతిభద్రతల క్షీణతను తెలియచేసింది. సాకేత్ కోర్టులోనే ఇంతకు ముందు లాయర్‌గా ఉన్న వ్యక్తి ఈ కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు ఈ మహిళతో పాతిక లక్షల రూపాయల మేర ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో ఆమెపై ఈ మాజీ లాయర్ దాఖలు చేసిన కేసు విచారణ ఈరోజే (శుక్రవారం) జరగాలి. విచారణకు ఇరువురు వచ్చారు.

Also Read: రైతులకు 2లక్షల ఋణమాఫీ: బట్టి విక్రమార్క

కోర్టు హాల్ వెలుపల వీరి మధ్య చాలా సేపు గొడవ జరిగింది. ఈ దశలో ఆయన తన చేతిలోకి గన్ తీయడంతో ఆమె ప్రాణభయంతో పరుగులు తీసింది. అయితే ఆమె వెనుక పడి ఈ వ్యక్తి కాల్పులు జరిపాడు. రక్షించండంటూ ఆమె కేకలు పెడుతున్న దశలోనే అతి దగ్గరి నుంచి మూడో రౌండ్ తూటాలు పేల్చాడు. ఘటనలో గాయపడ్డ మహిళను అక్కడున్న వారు , భద్రతా సిబ్బంది తీసుకువెళ్లారు. ఉదయం పదిన్నర ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఎం రాధా (40 ఏండ్లు పైగా వయస్సు)పై ఆగంతకులు కడుపుపై, చేతిపై కాల్పులు జరిపినట్లు దక్షిణ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ చందన్ చౌదరి విలేకరులకు తెలిపారు. ఆమెను వెంటనే స్థానిక మాక్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స నిర్వహించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడైంది. దాడికి దిగిన వ్యక్తి ఆ తరువాత కోర్టు వెనుక ద్వారం గుండా తప్పించుకు వెళ్లాడు. పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News