Monday, November 25, 2024

మర్డర్ కేసు… 50 సంవత్సరాల తరువాత నిందితుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: హత్య చేసిన 50 సంవత్సరాల తరువాత నిందితుడిని పోలీసులు పట్టుకున్న సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సీతారామ్ భతానే అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సాజిపూర్ ప్రాంతం ధనుష్యద్రి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించేవాడు. 1973 సెప్టెంబర్ 11న మనిబెన్ శుక్లా(73) ఇంట్లోకి దొంగతనం చేయడానికి భతానే వెళ్లాడు. దొంగతనం చేస్తుండగా శబ్ధం రావడంతో శుక్లాకు మెలకువ వచ్చి అతడిని గుర్తు పట్టింది. వెంటనే ఆమెను చంపేసి ఇల్లు బయట డోర్ కు లాక్ చేసి అక్కడ నుంచి అతడు పారిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి డోర్ ను బలవంతంగా ఓపెన్ చేశారు.

ఇంట్లో లోపల కుళ్లిపోయిన శుక్లా మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. స్థానికుల సమాచారం మేరకు భతానే చివరిగా ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు గుర్తించారు. నిందితుడి కో్సం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఆచూకీ లభించలేదు. పోలీస్ అధికారి పివి గోహ్లి పాత కేసులలో లభించని నిందితుల వివరాలను బయటకు తీశాడు. 1973లో జరిగిన ఈ కేసును బయటకు తీశాడు. ఆధార్ కార్డు ద్వారా భతాని గుర్తించాడు. అహ్మద్ నగర్ జిలలా పతార్ధి ప్రాంతం రంజని గ్రామంలో భతాని నివసిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హత్య చేసినప్పుడు నిందితుడి వయసు 23 సంవత్సరాలు ఉండగా ఇప్పుడు 73 సంవత్సరాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News