Friday, December 20, 2024

మేడ్చేల్ నగల దుకాణం దోపిడీని ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చేల్ లోని నగల దుకాణంలో ఇద్దరు దుండగులు కత్తులతో బెదిరించి దోపిడీ చేశారు. వారు నగదును తీసుకుని పారిపోయారు. దుండగులిద్దరూ బుర్ఖా, హెల్మేట్ ధరించి దోపిడీ చేశారు.  వారిని షాపు యజమాని కుమారుడు స్టూల్  విసిరి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుకాణం యజమాని శేషురామ్ చౌదరిని దుండగులు గాయపరిచారు కూడా. ఆయన ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదిలావుండగా జగదాంబ జ్యువేలరీ షాఫు సిసి కెమెరాల సీసీ ఫుటేజ్, బైక్ నంబర్, ఇతర  ఆధారాలతో  పోలీసులు  24 గంటల్లోనే దుండగులను పట్టుకున్నారు. వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News