Wednesday, November 13, 2024

పిస్టల్ ను అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైబరాబాద్ ఎస్ఒటి పోలీసులు అక్రమ ఆయుధాల రాకెట్‌ ను ఛేదించారు. 3 లైవ్ రౌండ్‌ లతో పాటు ఒక పిస్టల్‌ ను యువకుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సైబరాబాద్ సిపి ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేయడంతో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

వాహనాల తనిఖీల్లో భాగంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్యనగర్‌, చింతల్‌ లో గత రాత్రి ఎస్‌ఒటి బాలానగర్‌ పోలీసులు, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ యువకుడు యాక్టివా వాహనంపై రావడంతో అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. యాక్టివా వాహనంలో మూడు బుల్లెట్ల తో కూడిన ఒక కంట్రీ మేడ్ పిస్టల్ కనిపించడంతో దానిని స్వాధీనం చేసుకుని విచారించారు.

జీడిమెట్ల కుతుబుల్లాపూర్ అయోధ్యనగర్‌ లో గుడ్డి వంశీ కృష్ణగౌడ్ అనే యువకుడు నివసిస్తన్నారు. ఫేస్ బుక్ లో అతడికి మధ్యప్రదేశ్‌ కు చెందిన ఒక విశాల్ యాదవ్ గత సంవత్సరం పరిచయమయ్యాడు. గత సంవత్సరం నుండి ఫోన్ లో అనేక సార్లు మాట్లాడుుకన్నారు. తాను ఆయుధాలు సరఫరా చేస్తానని, మీకు ఆసక్తి ఉంటే పిస్టల్స్ సరఫరా చేస్తానని, హైదరాబాద్‌ లో ఆయుధాలు అమ్మడం ద్వారా భారీగా డబ్బు సంపాదించొచ్చని విశాల్ యాదవ్ వెల్లడించారు.

వంశీ ఆయుధాల వ్యాపారం ప్రారంభించడానికి అంగీకరించి ఒక పిస్టల్ (ధర రూ. 50,000) కోసం గత నెలలో ఫోన్ పే ద్వారా రూ. 19,000/- చెల్లించాడు. విశాల్ మార్చి 6 న వరంగల్ ఖాజీపేటకు వచ్చి పిస్టల్ తీసుకుని వచ్చానని వంశీకి చెప్పాడు. వంశీ ఖాజీపేట తన యాక్టివా వాహనంలో వెళ్లి విశాల్‌ ను కలిసి రూ. 30,000/- నగదు ను విశాల్ కు చెల్లించి 3 లైవ్ రౌండ్ల తో కూడిన పిస్టల్ తీసుకుని కుతుబుల్లాపూర్ కు తిరిగి వచ్చాడు. అతను గత ఒక నెల రోజులనుంచి ఆ పిస్టల్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే నిన్న రాత్రి ఆయుధంతో బయటికి వచ్చి యాక్టివా బైక్‌ పై బాలానగర్ వైపు వెళ్తు మార్గమధ్యలో చింతల్ వద్ద ఎస్ఒటి బాలానగర్ పోలీసులు, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాడు, అతనినుండి 3 రౌండ్ల తో లోడ్ చేయబడిన ఒక కంట్రీ మేడ్ పిస్టల్ ను స్వాధీనం చేసుకోడం జరిగింది. ఇతడిని పట్టుకోవడం ద్వారా ఆయుధం సంఘ వ్యతిరేకుల చేతుల్లోకి వెళ్లకుండా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అడ్డుకోగలిగారు. అలాగే ఇంతకు ముందు ఎవరికైనా ఆయుధాలు విక్రయించారా అనే కోణం లో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News