Sunday, January 19, 2025

అప్పు తీర్చలేక అతిక్రూరంగా హత్య

- Advertisement -
- Advertisement -

అప్పు ఇచ్చిన మహిళను హత్య చేసిన నిందితుడు
నిందితుడికి రూ.7లక్షలు ఇచ్చిన బాధితురాలు
తిరిగి ఇవ్వమని ఫోర్స్ చేయడంతో హత్య చేసిన నిందితుడు
నర్సుగా పనిచేస్తున్న బాధితురాలు
వడ్డీ వ్యాపారం చేస్తున్న నర్సు
ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం
వివరాలు వెల్లడించిన డిసిపి రూపేష్
సిటిబ్యూరోః నగరంలోని మలక్‌పేట మూసీ సమీపంలో మొండెం లేని తల దొరికిన కేసును పోలీసులు చేధించారు. మొండెం లేని తల ఓ నర్సుదిగా గుర్తించారు. ఆరు రోజుల క్రితం మలక్ పేటలోని మూసీ పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద నల్లటి ప్లాస్టిక్ కవరులో మొండెంలేని తల కనిపించడం కలకలం సృష్టించింది. సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి రూపేష్ మలక్‌పేట పిఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని ఆర్టీసి క్రాస్ రోడ్డుకు చెందిన ఎర్రం అనురాధ రెడ్డి(55) నర్సుగా పనిచేస్తూ దిల్‌సుక్‌నగర్‌లోని చైతన్యపురిలోని చంద్రమోహన్ (48) ఇంటిలో అద్దెకు ఉంటోంది. చంద్రమోహన్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటాడు. పై అంతస్థులో చంద్రమోహన్ ఉంటుండగా, కింది అంతస్థులో అనురాధ ఉంటోంది. చంద్రమోహన్‌కు వివాహం కాకపోవడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అనురాధరెడ్డి భర్త 15 ఏళ్ల క్రితం మృతిచెందడంతో ఒంటరిగా ఉంటోంది.

నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ, స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రమోహన్ స్టాక్ మార్కెట్‌లో నష్టపోవడంతో బాధితురాలి వద్ద రూ.7లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని చాలా రోజులు అవుతున్నా నిందితుడు ఇవ్వకపోవడంతో అనురాధ తరచూ చంద్రమోహన్‌తో గొడవపెట్టుకునేది. అనురాధ డబ్బుల ఇవ్వాలని ఇబ్బంది పెట్టుతుండడంతో అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. దీనికి అనుగుణంగా సూపర్ మార్కెట్‌కు వెళ్లి కత్తులు, కట్ చేసే మిషన్లు కొనుగోలు చేసి తీసుకుని వచ్చాడు. ఈ నెల 12వ తేదీ ఇద్దరి మధ్య గొడవ ఎక్కువకావడంతో చంద్రమోహన్ కత్తులతో అనురాధ ఛాతి, కడుపులో పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో రెండు కటింగ్ మిషన్లతో మృతదేహాన్ని కోశాడు. తల, కాళ్లు, చేతులను వేరు చేశాడు. కాళ్లు, చేతులను కవర్‌లో చూట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి, తలను ఈ నెల 17వ తేదీన కవర్‌లో పెట్టి మూసి సమీపంలోకి ఆటోలు తీసుకుని వచ్చి పడేశాడు.

మిగతా బాడీ డికంపోజ్ అయి చుట్టుపక్కల వారికి స్మెల్ రాకుండా ఉండేందుకు రోజు ఫినాయిల్, డెటాల్, ఫర్‌ఫ్యూమ్ కొట్టుతు ఉంటున్నాడు. బాధితురాలి ఫోన్‌ను వాడుతూ తాను కేదార్‌నాథ్ యాత్రకు వెళ్తున్నాని, చాలా రోజులు ఫోన్‌లో అందుబాటులో ఉండడని బంధువులు, ఆస్ట్రేలియాలో ఉంటున్న కూతురికి ఆమో మొబైల్ ఫోన్ నుంచి మెసేజ్‌లు పంపించాడు. వీటి ద్వారా అనురాధ బతికి ఉన్నట్లు వారిని నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు. మిగతా శరీర భాగాలను ఒక్కొక్కటిగా బయటపడేయాలని నిందితుడు ప్లాన్ వేశాడు. సిసి కెమెరాలు, మిస్సింగ్ కేసులను గురించి ఆరా తీసిన పోలీసులు చివరికి పోస్టర్ ముద్రించి దర్యాప్తు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, డిఐ భాస్కర్‌రెడ్డి తదితరులు దర్యాప్తు చేశారు.

మృతురాలి ఆచూకీ కోసం 8 బృందాలు
మూసి సమీపంలో మొండెంలేని తల లభించడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఆచూకీ లభించకపోవండంతో పోలీసులు మహళ తలతో పోస్టర్లను ముద్రించి వాటిని పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఆమె గురించి ఆరా తీశారు. మలక్‌పేట, సైదాబాద్, చాదర్‌ఘాట్, పాతబస్తీలో మలక్‌పేట పోలీసులు తిరిగారు. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్, శంకర్‌నగర్, మూసానగర్‌లో పోలీసులు ఇంటింటికి తిరుగుతూ పోస్టర్‌ను చూపించి వివరాలు అడిగితెలుసుకున్నారు. పోస్టర్లను చూసిన ఆమె సోదరి, బావ గుర్తించడంతో పోలీసులు ఆ తల నర్సు అనురాధదేనని తేల్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News