Thursday, January 23, 2025

హోంమంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

మనోహరాబాద్: రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ వాహనాలు ఆదివారం పోలీసులు తనిఖీ చేశా రు. మండలంలోని కాళ్లకల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టు వద్ద రాష్ట్ర హోంమంత్రి హైదరాబాద్ నుంచి కామారెడ్డికి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో చెక్‌పోస్టు వద్దకు రాగానే వాహనాలను పోలీసులు ఆపారు. హోంమంత్రి ఎంపీలు వాహనాలు దిగి వారి వాహన తనిఖీలు కోసం పోలీ సులకు సహకరించాలని మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్‌రెడ్డి, తూప్రాన్ ఏఎస్‌ఐ లక్ష్మిలు తెలిపారు. దీంతో రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ వా హనం దిగి పోలీసులకు సహకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News