Thursday, January 16, 2025

కెసిఆర్ కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల వేళ రాష్ట్రంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద పలువురు నేతల వాహ నాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఎండిన పంటల పరిశీలనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బస్సును పోలీ సులు ఆదివారం తనిఖీ చేశారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పర్యటనలో భాగంగా ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి నుంచి సూర్యాపేట వెళ్లారు. ఈ క్రమంలోనే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరవత్ తండాలో రైతులను కలిసి తిరిగి వెళ్తుండగా ఎన్నికల కోడ్

అమలులో ఉండడంతో కెసిఆర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని కొడకండ్ల మండలం మొండ్రాయి ఎలక్షన్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేశారు. విధి నిర్వహణలో భాగంగా తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు కెసిఆర్ పూర్తిగా సహకరించా రు. కెసిఆర్ వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీస్ అధికారులు చెక్ చేశారు. అనంతరం బస్సులో ఏం లేకపోవ డంతో వాహనాలను పంపించేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News