Monday, January 20, 2025

పంచాగం ప్రకారం కదలండి.. ఠాణాలకు యుపి డిజిపి సర్కులర్

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ ఆధ్వర్య ప్రభుత్వ హయాంలో పోలీసు స్టేషన్లకు హిందూ పంచాంగం పాటించాలని సూచించారు. యుపి డిజిపి విజయ్ కుమార్ ఇటీవల ఓ సర్కులర్ వెలువరించారు. ఇందులో ఆయన పోలీసులు తమ విధుల దశలో హిందూ పంచాంగాన్ని అనుసరించాలని సూచించారు.

అమావాస్య రోజున ఎక్కువగా నేరాలు ఘోరాలు జరుగుతాయని తెలిపి,ఈ రాత్రి అప్రమత్తతతో ఉండాలని ఠాణాలకు హితవు పలికారు. అమావాస్య కటిక చీకట్లు ఉంటాయని, ఈ దశలో అకృత్యాలకు ఎక్కువగా వీలుందని డిజిపి తమ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ఈ సర్కులర్ టీవీల్లో చర్చకు దారితీసింది. తనిఖీలకు, నేరగాళ్ల వేటకు కూడా సుముహర్తాలు చూసుకుని పంచాంగంలో రాసి ఉందని, దీనిని పాటించాలని గోష్టిలో పాల్గొన్న ఓ పండితుడు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News