Wednesday, January 22, 2025

చంద్రయాన్ 3 పై ట్వీట్… ప్రకాశ్ రాజ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

బాగల్‌కోట్ : చంద్రయాన్ 3 పై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై కర్ణాటక లోని బాగల్‌కోట్ జిల్లా లోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు వ్యక్తులు ప్రకాశ్ రాజ్‌పై ఫిర్యాదు చేశారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగాన్ని అపహాస్యం చేశారని, ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలని కొందరు హిందూ సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారని బాగల్‌కోట్ లోని బనహట్టి పోలీస్‌లు వెల్లడించారు.

చంద్రయాన్ 3 ప్రయోగం కీలక దశకు చేరిన సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుంచి పంపుతున్న మొదటి ఫోటో అనే వ్యాఖ్యకు ఒక వ్యక్తి టీ తయారు చేస్తున్న ఫోటోను జోడించి ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఇది తమ నాయకుడిని ఉద్దేశించే పోస్ట్ చేశారని కొందరు విమర్శించగా, దేశ ప్రగతి, ప్రతిభను సహించలేక ప్రకాశ్ రాజ్ ఇలా స్పందించారని మరి కొందరు నెటిజన్లు దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News