Wednesday, December 4, 2024

రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Police Complaint against Revanth Reddy

సిఎం పట్ల అనుచిత వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ నేతల మండిపాటు

జగిత్యాల : సిఎం కెసిఆర్‌ను జోరాట కట్టమీద ఉరి తీయాలని, కల్వకుర్తి కట్ట కింద రాళ్లతో కొట్టి పాతరేయాలని అనుచిత వ్యా ఖ్యలు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ టిఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గత శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో దక్షిణ తెలంగాణకు సిఎం కెసిఆర్ తీరని ద్రోహం చేశారని, ఆయన చేసిన ద్రోహానికి జూరా ల కట్ట మీద, శ్రీశైలం గట్టు మీద ఉరి తీసినా తప్పులేదని, కల్వకుర్తి కట్ట కింద కెసిఆర్‌ను రాళ్లతో కొట్టి పాతరేయాలంటూ మాట్లాడిన రేవంత్‌పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలంటూ టిఆర్‌ఎస్ విద్యార్థి నాయకుడు బోగోజి ముఖేష్‌కన్నా, సోషల్ మీడియా అధ్యక్షుడు అలిశెట్టి వేణుగోపాల్, కార్యదర్శి వెంకటేష్, రాగుల రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News