Saturday, November 23, 2024

వివాదంలో విజయ్ తాజా చిత్రం లియో..నా రెడీ పాటపై ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ప్రముఖ నటుడు విజయ్ నటిస్తున్న తాజా చిత్రం లియో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని నా రెడీ అనే పాటలో విజయ్ సిగరెట్ తాగుతూ, మద్యం గ్లాసు చేతిలో పుచ్చుకుని కనిపించడమే ఈ వివాదానికి కారణం. సెల్వం అనే వ్యక్తి చెన్నై నగర పోలీసు కమిషనర్ శంకర్ జీవల్‌కు విజయ్ నటించిన పాటలోని అభ్యంతరకర దృశ్యాలపై ఫిర్యాదు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్, పౌకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌ను ప్రస్తావిస్తూ ఈ పాటలోని దృశ్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సెల్వం ఫిర్యాదు చేశారు.

విజయ్ స్వయంగా పాడిన నా రెడీ అనే పాట రౌడీయిజాన్ని, డ్రగ్స్ అలవాటును ప్రోత్సహించే విధంగా ఉందని నోట్లో సిగరెట్ పెట్టుకుని, మద్యం తాగుతూ విజయ్ డ్సాన్సు చేస్తున్న దృశ్యాలు యువతపై తీవ్ర ప్రభావం చూపగలవని సెల్వం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 25న ఆన్‌లైన్‌లో సెల్వం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నా రెడీ పాటలో మద్యాన్ని, పొగాకును ప్రోత్సహిస్తున్న విజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కూడా సెల్వం హెచ్చరించారు.

2019లో కార్తీతో ఖైదీ, 2022లో కమల్ హాసన్‌తో విక్రమ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం రూపొందుతున్న లియో చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News