- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ సాయిపల్లవిపై భజరంగ్‌దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.ఓ యూట్యూబ్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.సాయిపల్లవి వ్యాఖ్యలపై వీడియో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు తెలిపారు.
- Advertisement -