Sunday, December 22, 2024

కానిస్టేబుల్ తుది రాత పరీక్ష తేదీ ఖరారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది పరీక్షల ప్రక్రియ ఏప్రిల్ 30తో ముగియనుంది. పోలీసు కానిస్టేబుల్ (సివిల్), పోలీసు కానిస్టేబుల్ (ఐటి అండ్ సివొ) ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవెల పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) ఖరారు చేసింది. ఏప్రిల్ 30న ఈ రాతపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. సివిల్ ఉద్యోగాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఐటి అండ్ సివో ఉద్యోగాలకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 28న అర్ధరాత్రి 12 గంటల వరకు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసేప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.inకు మొయిల్ లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News