Saturday, December 21, 2024

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో నక్సల్, కానిస్టేబుల్ హతం

- Advertisement -
- Advertisement -

కంకేర్ (ఛత్తీస్‌గఢ్ ): ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లాలో ఆదివారం ఎన్‌కౌంటర్‌లో నక్సల్‌తోపాటు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. హిదూర్ అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నారని సమాచారం అందడంతో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్ (డిఆర్‌జి) , బస్తర్‌ఫైటర్స్, రాష్ట్ర పోలీస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) , జిల్లా ఫోర్స్, గాలింపు చర్యలు చేపట్టారు. గస్తీబృందం అటవీ ప్రాంతాన్ని దిగ్బంధం చేయడంతో నక్సల్స్ కాల్పులకు బరితెగించారు. ఈ పోరులో బస్టర్ ఫైటర్స్‌కు చెందిన కానిస్టేబుల్ రమేష్ కురేతి ప్రాణాలు కోల్పోయాడని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పి చెప్పారు. సంఘటన స్థలం నుంచి నక్సల్ మృతదేహం, ఎకె 47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంకా ఆ అటవీప్రాంతంలో గాలింపు కొనసాగుతోంది. మృతుడు కానిస్టేబుల్ కురేతి కంకేర్ జిల్లా పఖంజూర్ ఏరియా లోని సంగం గ్రామానికి చెందిన వాడని ఐజీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News