Saturday, December 21, 2024

తుపాకీ మిస్‌ఫైర్..కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఖైరతాబాద్‌లోని మింట్‌కాంపౌండ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…హెడ్‌కానిస్టేబుల్ రామయ్య(46) మింట్ కాంపౌండ్ ప్రెస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే రామయ్య ఉదయం తుపాకీని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఫైర్ అయ్యింది. దీంతో తీవ్ర గాయాలపాలయిన రామయ్యను వెంటనే నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు.

పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాల్పుల విషయం తెలియగానే సైఫాబాద్ ఎసిపి సంజయ్‌కుమార్, సిఐ సత్తయ్య పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలం నుంచి క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News