Wednesday, January 22, 2025

ప్రశాంతంగా ముగిసిన పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ (సివిల్), పోలీస్ కానిస్టేబుల్ (ఐటి అండ్ సిఒ) ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు తెలంగాణ స్టేట్ లెవ్ల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం తెలిపింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. 1,09,663 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 1,08, 055 మంది హాజరుకాగా 98.53శాతం హాజరునమోదైందని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా తొమ్మిది జిల్లాలోని 183 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

పోలీస్ కానిస్టేబుల్ (ఐటి అండ్ సిఒ) పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది. హైదరాబాద్ సహా ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష కొనసాగింది. 6,801 మంది అభ్యర్థులకు గాను 6,088 మంది పరీక్ష రాయగా 89.52శాతం హాజరు నమోదైనట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ప్రణాళికా బద్ధంగా పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని, పరీక్ష సమయంలో అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోలు సేకరించినట్లు తెలిపింది. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని అందుబాటు లో ఉంచనున్నట్లు వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News