Thursday, January 23, 2025

ఇసుక అక్రమ రవాణా: అడ్డుకున్న కానిస్టేబుల్‌పై దూసుకెళ్లిన లారీ

- Advertisement -
- Advertisement -

కలాబురగి: కర్నాటకలోని కలాబురగి జిల్లా జేవర్గి తాలూకాలో గురువారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీ మీద నుంచి దూసుకెళ్లడంతో ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ మయూర్ భీము చౌహాన్(51)పై నుంచి లారీ దూసుకెళ్లిందని జిల్లా ఎస్‌పి ఇషా పంత్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

అక్రమ ఇసుక మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోవడానికి పోలీసులు హుల్లూరు గ్రామ సమీపంలో ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి చెక్‌పోస్టు వద్ద విధి నిర్వహణలో ఉన్న చౌహాన్ ఇసుక లోడుతో వస్తున్న లారీని ఆపేందుకు ప్రయత్నించగా లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా కానిస్టేబుల్ మీద నుంచే పోనిచ్చాడు. లారీ డ్రైవర్ వాహనంతోసహా పరారయ్యాడు.

కాగా..ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి నష్టపరిహారంపై హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News