Wednesday, January 22, 2025

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం: నిందితుడికి అండగా పోలీసులు

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన పోలీసు కానిస్టేబుల్‌ను మంచానికి కట్టేసి చితకబాదిన స్థానికులుఅతడిని పోలీసు స్టేషన్‌లో అప్పగించగా అక్కడి నుంచి అతను తప్పించుకు పారిపోవడానికి తోటి ఉద్యోగులే సహకరించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో జరిగినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.

వైద్య పరీక్షకు తీసుకెళుతుండగా నిందితుడు మహేష్ కుమార్ గుర్జర్ తప్పించుకు పారిపోవడానికి స్థానిక పోలీసులు సహకరించినట్లు అధికారులు తెలిపారు. వివాహితైన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ గుర్జర్‌తోపాటు బస్వా పోలీసు స్టేషన్ అధికారి(ఎస్‌హెచ్‌ఓ)ని గురువారం సస్పెండ్ చేసినట్లు అధికారులు వివరించారు.

మంగళవారం రాత్రి ఒంటరిగా ఉన్న ఒక 30 ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ మహేష్ కుమార్ గుర్జర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ గట్టిగా కేకలు వేయగా ఇరుగుపొరుగు నివసించే స్థానికులు వచ్చి గుర్జర్‌ను పట్టుకున్నారు. ఇంతలో ఆమె భర్త కూడా ఇంటికి చేరుకుని గుర్జర్‌ను మంచానికి కట్టేసి చితకబాదినట్లు సర్కిల్ అధికారి బందికుల్ ఈశ్వర్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న బస్వా పోలీసు స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గుర్జర్‌ను వైద్య పరీక్షల కోసం తమ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడిని వదిలిపెట్టివేశారని ఆయన చెప్పారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం ఈ విషయం వెలుగుచూసిందని ఆయన తెలిపారు.

ఈ ఘటన గురించి సీనియర్ అధికారులకు మంళవారం రాత్రే తెలియచేయనందుకు బస్వా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను అధికారులు సస్పెండ్ చేశారు. వేరే పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న నిందితుడు గుర్జర్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు సర్కిల్ అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News