Thursday, January 23, 2025

మానుకోటలో పోలీసుల కార్డన్ సెర్చ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్‌లో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామునే మానుకోట టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్‌లో ఇంటింటా సోదాలు నిర్వహించారు. డీఎస్పీ రమణ బాబు నేతృత్వంలో ఇద్దరు సీఐలు ఆరుగురు, ఎస్సైలు, 35 మంది కానిస్టేబుళ్ల బృందంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణ బాబు మాట్లాడుతూ.. అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 30 వేల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గుడుంబా తయారీ కేంద్రాల్లో గుడుంబాతో పాటు అందుకు ఉపయోగించే బెల్లంపానకాన్ని ద్వంసం చేశామని తెలిపారు. అలాగే గుర్తింపు పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. ఇటీవల పెరిగి పోతున్న సైబర్ క్రైమ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.

Also Read: పాలిటెక్నిక్ కళాశాల నుంచే రాజకీయాల్లో అడుగు పడింది: మంత్రి హరీశ్‌

సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి నేరాలు జరిగినా నిందితులను పట్టుకునేందుకు అవి ఎంతగానో దోహదపడుతాయని వివరించారు. ప్రతి వ్యక్తి కూడా యూనిఫారాలు లేని పోలీసులుగా భావించి సమాజంలో పేట్రేగిపోతున్న సంఘ వ్యతిరేకశక్తులను అరికట్టేందుకు దోహదపడాలని సూచించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ప్రశ్నించాలని, అవసరమైతే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ మేరకు కార్డన్ సెర్చ్ సందర్భంగా అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ వై. సతీష్, రమేష్, ఎస్సైలు రవి, శ్రీలత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News