- Advertisement -
హైదరాబాద్: ఎపి మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసులు గురువారం నాడు సికింద్రాబాద్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలామంది పరారీలో ఉన్నారని, ప్రస్తుతం అఖిలప్రియకు బెయిల్ ఇస్తే నిందితులకు సహకరించే అవకాశాలు సైతం ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇదిలావుండగా అఖిలప్రియ విచారణకు సహకరిస్తారని ఆమె తరఫు న్యాయవాదలు కోర్టుకు చెప్పడంతో పాటు ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటి(శుక్రవారానికి)వాయిదా వేసింది. అటు భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది.
Police Counter on Akhila Priya Bail Petition
- Advertisement -