Saturday, December 28, 2024

సిపిని కలిసిన ప్రీ వెడ్డింగ్ షూట్ దంపతులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన పోలీస్ దంపతులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై భావన, రిజర్వు ఎస్సైగా పనిచేస్తున్న రావు కిషోర్ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి యూనిఫాం, పోలీస్ వాహనాలతో ప్రీ వెడ్డింగ్ షూట్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తీయించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్ యూనిఫాంలో ఉండడం, డిపార్ట్‌మెంట్‌కు సంబంధింన వాహనాలు వాడడం, ఏకంగా పోలీస్ స్టేషన్‌లోని షూట్ చేయడంపై పలు విమర్శలు వచ్చాయి. దానిపై స్పందించిన సిపి సివి ఆనంద్ చిన్న తప్పుగా భావించి వదిలేశారు. ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా ఇలా చేయకూడదని అన్నారు.ఈ నేపథ్యంలో ఎస్సైల దంపతులు సిపి సివి ఆనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జీవితంలో సంతోషంగా ఉండాలని కొత్త జంటకు సిపి సివి ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News