Sunday, December 22, 2024

24గంటల్లో చోరీ కేసును చేధించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఇరవైనాలుగు గంటల్లో చేధించారు. దొంగను అరెస్టు చేసి 12.5తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….హైదరాబాద్, లకిడికాపూల్‌కు చెందిన అమ్‌టూల్ బాటూల్ ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 1గంటలకు సోదరి ఇంటికి వెళ్లింది. ఇంట్లో మరమ్మతు పనులు జరుగుతుండడంతో ఓల్డ్ సిటీలోని సోదరి వద్దకు వెళ్లి తిరిగి సాయంత్రం 5గంటలకు తిరిగి వచ్చింది.

ఇంట్లోని కిచెన్ రూమ్ వర్క్ పూర్తి అయిన తర్వాత రాత్రి 11.30 గంటలకు నిద్రపోయే ముందు ఇంట్లోని అల్మారా తెరిచి చూసేసరికి అందులో ఉండాల్సిన 12.50 తులాల బంగారు ఆభరణాలు కన్పించలేదు. వెంటనే సైఫాబాద్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి మహ్మద్ దావుద్ ఇస్మాయిల్ అలియాస్ హనీ చోరీ చేసినట్లు గుర్తించారు. వెంటనే దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని 24గంటల్లో అరెస్టు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News