Thursday, January 9, 2025

నాలుగేళ్ల బిడ్డపై క్రిమినల్ కేసు.. బెయిల్ కోసం తల్లి పోరాటం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణపై ఒక రెండేళ్ల చంటిబిడ్డపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2021లో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పుడు నాలుగేళ్ల వయసులో ఉన్న ఆ పిల్లవాడికి బెయిల్ కోసం ఆ పిల్లవాడి తల్లి కోర్టు చుట్టూ తిరుగుతోంది. బీహార్‌లోని బెగుసరాయ్ పోలీసు స్టేషన్‌లో బాలుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ విషయం గురువారం నాడే ఆ తల్లికి తెలియడంతో కోర్టుకు వచ్చి తన పిల్లవాడికి బెయిల్ ఇప్పించాలంటూ న్యాయవాదులను ప్రాదేయపడింది.

2021లో కొవిడ్ లాక్‌డౌన్ అమలులో ఉన్న కాలంలో పోలీసులు కంటెయిన్‌మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఉల్లంఘించి బయటకు వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి ప్రయత్నించారంటూ బెగుసరాయ్ జిల్లాలోని మఫుసిల్ పోలీసు స్టేషన్‌లో 2021 ఏప్రిల్ 10న మొత్తం 8 మందిపై క్రిమినల్ కేసు నమోదైంది. నిందితులలో ఆ పిల్లవాడితోపాటు అతని తల్లిదండ్రులు కూడా ఉన్నారు.

ఈ కేసు వివరాలు బయటపడడంతో గురువారం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులంతా గుమికూడి ఈ కేసు గురించి చర్చిందారు. రెండేళ్ల పిల్లవాడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. ఏడేళ్ల లోపు వయసున్న ఏ బిడ్డయినా ఎటువంటి నేరం చేసినా ఐపిసి 82 సెక్షన్ ప్రకారం దాన్ని నేరంగా పరిగణించకూడదని, శిక్షించడానికి వీల్లేదని సీనియర్ న్యాయవాది రాజేష్ సింగ్ తెలిపారు. ఈ సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్‌ను రద్దు కోరుతూ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేయవచ్చని ఆయ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News