Tuesday, December 24, 2024

మావోయిస్టులు అమర్చిన మందుపాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చర్ల: మావోయిస్టులు అమర్చిన మందుతపాతరను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను చర్ల సిఐ అశోక్ వెల్లడించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చర్ల పోలీసులు, స్పెషల్‌పార్టీ సిబ్బంది కలిసి శనివారం మండల పరిధిలోని బోదనెల్లి, ఏర్రబోరు గ్రామాల మధ్యగల రహదారిని తనిఖీ చేసినట్లు పెర్కోన్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన దాదాపు ఇరవై కేజీల మందుతపాతరను గుర్తించి నిర్వీర్యం చేసిన్నట్లు తెలిపారు.

మావోయిస్టుల వికృత చర్యల వల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిత్యం వందలాది మంది ప్రజలు తిరిగే రహదారుల్లో మందుపాతరలు అమర్చుతూ అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్నారని తెలిపారు. ఆదివాసీ ప్రజలకు మరియు వారి పశువుల ప్రాణాలకు హాని తలపెడుతున్న అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టుల చర్యలను ఖండించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News