Friday, December 20, 2024

ఢిల్లీలో ఆలయం తొలగింపు..పోలీసులతో స్థానికుల ఘర్షణ(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని మండవలి ప్రాంతంలో గురువారం ఒక ఆలయానికి చెందిన కొంత భాగాన్ని పోలీసులు తొలగించడానికి ప్రయత్నించడంతో స్థానికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆలయంలోని కొంత భాగాన్ని తొలగించడానికి పోలీసులు ప్రయత్నించగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని పోలీసులతో ఘర్షణకు దిగారు. మహిళలు కూడాకర్రలు చేతిలో పట్టుకుని పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News