బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున కామారెడ్డిలో దళితుడి బట్టలూడదీసి పోలీసులు ఈడ్చుకుపోవడం దారుణమన్నారు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్యానర్ కట్టడం నేరం ఎప్పుడు అయిందో చెప్పాలని అడిగారు. బ్యానర్ కట్టిన దళితుడిపై ఇంత క్రూరంగా దాడి చేయడం ఆటవిక న్యాయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ రోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అరాచక పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాలపై ఇప్పటికైనా రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ కోరుకుంటున్న మొహబ్బత్ కా దుకాణ్‌లో దళితుల పరిస్థితి ఇలానే ఉంటుందా..? అని ప్రశ్నించారు. దళితుడి బట్టలూడదీసిన సంఘటనకు సంబంధమున్న పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడ్డ దళిత వ్యక్తికి పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు.
అంబేద్కర్ జయంతి రోజున దళితుడికి ఘోర అవమానం:కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -