Friday, December 20, 2024

కానిస్టేబుల్‌ను కారు ఢీకొట్టి… బ్యానెట్‌పై 1.5 కిలో మీటర్లు ప్రయాణించిన పోలీస్

- Advertisement -
- Advertisement -

ముంబయి: సిగ్నల్ వద్ద కారు జంప్ చేయడంతో పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ పైకి కారు వెళ్లడంతో అతడు వాహనం బ్యానెట్ పట్టుకొని 1.5 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన మహారాష్ట్రలోని వాసాయి ప్రాంతంలో జరిగింది. కారు డ్రైవ్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సోమనాథ్ చౌదరీ(41) అనే కానిస్టేబుల్ థానే రూరల్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నాడు.

వసంత్ నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. 12వ తరగతి చదువుతున్న సవేష్ సిద్ధిక్ అనే యువకుడు కారు డ్రైవ్ చేసుకుంటూ సిగ్నల్ వద్ద జంప్ చేశాడు. వెంటనే సోమనాథ్ కారు ఆపటానికి ప్రయత్నించాడు. కారు అతడిపైకి వెళ్లడంతో కారు బ్యానెట్‌ను పట్టుకున్నాడు. కారును సవేష్ 1.5 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత స్థానకులు రోడ్డుకు అడ్డుగా బైక్‌లు పెట్టడంతో కారును సదరు యువకుడు ఆపాడు. వెంటనే యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు. కానిస్టేబుల్ చిన్నపాటి గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్థానికులు కారు అడ్డుకోకపోతే కారు కిందపడేవాడినని కానిస్టేబుల్ తెలిపాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News