Tuesday, January 14, 2025

బిఆర్‌ఎస్ కార్యకర్తను కారుతో ఈడ్చుకెళ్లిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

ఓ వైపు నిందితులకు రాచమర్యాదలు అమలు చేస్తూ విమర్శలకు గురవుతూ వస్తున్న పోలీస్ శాఖ తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మరో వివాదాస్పద వివాదానికి తెరతీసింది. భువనగిరిలో బిఆర్‌ఎస్ నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా వారిని కారుతో రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న వైనం తీవ్ర చర్చనీయాంశమైంది. భువనగిరిలో బిఆర్‌ఎస్ పార్టీ ఆఫీసుపై యువజన కాంగ్రెస్ నాయకుల దాడికి నిరసనగా పట్టణంలోని

ప్రిన్స్ చౌరస్తా వద్ద సోమవారం నిరసన తెలుపుతున్న వల్లపు విజయ్ ముదిరాజ్ అనే కార్యకర్తను పోలీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న సంఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పోలీసులు విచక్షణారహితంగా సదరు బాధితున్ని నడిరోడ్డుపై కారుతో పాటు ఈడ్చుకుంటూ వెళ్లడంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News