Monday, December 23, 2024

మద్యంమత్తులో హల్ చల్…. పోలీసులకే వార్నింగ్…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఆర్ డిఒ సాయిబాబా దేవాలయం ప్రాంతంలో ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. తాను రాజకీయ నాయకుడనని పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో తానే కారు నడుపుకుంటూ వచ్చి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడాన్ని గమనించి పక్క సీట్లో ఉన్న వ్యక్తిని పోలీస్ లు చూస్తుండగా డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు తనిఖీ చేయమని పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . డ్రంక్ అండ్ డ్రైవ్ ను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులతో కూడా మీ అంతు చూస్తా నంటు బెదిరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News