Wednesday, January 22, 2025

కెసిఆర్ బస్సు యాత్రలో పోలీసుల వైఫల్యం

- Advertisement -
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బస్సు యాత్రలో పోలీసుల వైఫల్యం బయటపడింది. కేసీఆర్ బస్సు యాత్రలో జేబు దొంగల చేతి వాటం చూపించారు. నిజాం పెట్ డిప్యూటీ మేయర్ సోదరుడి మెడలో 3తులాల గొలుసు, దుండిగల్ స్థానికుడు పిఎసిసి వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ అనే వ్యక్తి మెడలో 2తులాల గొలుసు మాయం అయింది. దుందిగల్ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి సోదరుడి వద్ద పర్సు దొంగలు కాజేశారు. బౌరాం పెట్ కౌన్సిలర్ భర్త మురళీ యాదవ్ వద్ద గల 50వేల నగదు చోరీ చేశారు. దుండీగల్ తాండ నివాసి జగన్ నాయక్ అనే వ్యక్తి జేబులో నుండి కేటుగాళ్లు పర్సు మాయం చేశారు. ఈ ఘటనలపై బాధితులు పోలీస్ కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News