Wednesday, March 26, 2025

బెట్టింగ్ యాప్‌ల ఓనర్లకు ఉచ్చు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/: బెట్టింగ్ యాప్స్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో పోలీసులు రూటు మార్చినట్లు సమాచారం అందుతోంది. తాజాగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, బెట్టింగ్ యాప్ కంపెనీలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వారిని ప్రధాన నిందితులుగా చేర్చేందుకు సిద్ధ్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా యజమానులను టార్గెట్ చేసి చర్యలు చేపట్టిన పోలీసులు మొత్తం 19 మంది యాప్ ఓనర్ల పైన కేసులు నమోదు చేశారు. జంగిల్ రమ్మీ డాట్ కాం, ఎ 23, యోలో 247 ఫెయిర్ ప్లే, జీత్ విన్, వి బుక్, తాజ్ 77, ధని బుక్ 365, వి వి బుక్, మామ 247, ఎస్ 365 జై 365, తెలుగు 365, జెట్ ఎక్స్, పరి మ్యాచ్, తాజ్ 777 బుక్, ఆంధ్ర 365 యజమానుల పైన కేసులను నమోదు అయ్యాయి. ఇక ఇల్లీగల్ బెట్టింగుకు నిర్వాహకులే బాధ్యులని ప్రాథమిక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ కేసులో వారిని కూడా నిందితులుగా చేర్చి మియాపూర్ కో ర్టు లో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో యాప్‌ల యజమానుల ను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. బెట్టింగ్ యా ప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు

ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారిని చార్జిషీట్లో సాక్షులుగా చే ర్చే అవకాశం ఉందని తెలు స్తోంది. ఏదేమైనా ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పుడు యాప్‌ల యజమానుల మెడకు గట్టిగానే ఉచ్చు బిగుస్తోంది. ఇకపై బెట్టిగ్ యాప్ కంపెనీలపైనే చర్యలుంటాయట. లింక్ డౌన్‌లోడ్ చేసుకోండి, ఆడండి.. లక్షలు గెలుచుకోం డి అం టూ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన, విప రీతంగా ప్రచా రం క ల్పించి సెలబ్రిటీలు మాత్రం ఈ కేసుల్లో కేవలం సాక్షులేనట. బె ట్టింగ్ యాప్ కేసులో వాటిని ప్రమోట్ చేసిన ప్రముఖులం తా ఇక పై సాక్షులుగా మారబోతున్నారట. అలా సాక్షులుగా మారితే అలా వచ్చి, ఇలా సాక్ష్యం చెప్పి వెళ్లిపోతారంతే. ఇక సీన్ అంతా బెట్టింగ్ యాప్ కంపెనీలపై నడుస్తుంది. చర్యలన్నీ వారిపైనే ఉండబోతున్నాయట. ఇప్పటికే, ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోషన్ చేసినటువంటి కేసులో మొత్తం 11 మంది పైన మొదట కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణ ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నేహా శర్మతో సహా మొత్తం 25 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ‘

ఇదే సమయంలో కొందరు నందమూరి బాలకృష్ణ ,ప్రభాస్ ,గోపీచంద్ తదితరులపైన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినట్టు ఫిర్యాదులు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే నోటీసులు ఇచ్చి సెలబ్రిటీలను పంజాగుట్ట పోలీసులు విచారణ చేస్తున్నారు. తాజాగా సోమవారం యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు. మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్ మోసానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ మాటల వెనుక పరమార్ధం కూడా అదేనట. అయితే ఇలా బెట్టింగ్ కేసులో సెలబ్రిటీలను సాక్షులుగా మార్చడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుపై కెఎపాల్ తన స్టైల్‌లో రియాక్ట య్యారు. 72 గంటల్లోపు ఆ సెలబ్రిటీలను అరెస్ట్ చేయకపోతే సుప్రీం కోర్టుకు సైతం వెళ్తానంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసి, 980 మంది ప్రాణాలు తీసి, ఇప్పుడు క్షమించండి అంటే కుదరదు. బెట్టింగ్ ప్రమోషన్‌లో సంపాదించిన కోట్ల రూపాయలు ప్రజలకు పంచాలని డిమాం డ్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి సెలబ్రిటీల మెడకు చుట్టుకుందనుకున్న బెట్టింగ్ ప్రమోషన్ కేసులో ఏం జరిగిందో ఏమోకానీ ఫోకస్ ఇప్పుడు సంస్థలపైకి మళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News