మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి. బుధవారం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో జరిగిన ఉల్లంఘనలపై కేసు కట్టారు. అనుమతి లేకున్నా ర్యాలీ తీసినందుకు రేవంత్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద కేసు ఫైల్ చేశారు. దీంతో పాటు బేగం బజార్‌లో రేవంత్‌రెడ్డిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. బుధవారం పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. టిపిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందే అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చశారు.
అయితే రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కావాలనే కేసులు ఫైల్ చేశారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ అట్టహాసంగా జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు/కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రేవంత్‌రెడ్డి జై అనే నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది. చాలా చోట్ల బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ ఘనంగా జరగగా.. పోలీసులు మాత్రం రెండు కేసులు పెట్టారు. ఇదీ ముమ్మాటికీ కక్ష్యసాధింపే అని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు.
Police filed 2 cases against TPCC Chief Revanth Reddy