Friday, November 8, 2024

అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కొండాపూర్‌లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి తన అనుచరులతో వెళ్లి దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే గాంధీ, అతడి కుమారుడు పృథ్వీతోపాటు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 12న కౌశిక్‌రెడ్డి నివాసంపై అరికెపూడి గాంధీ అతడి అనుచరులు కలిసి టమాటాలు, గుడ్లు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ఇంటి అద్దాలు పగులగొట్టారు. పూల కుండీలను ధ్వంసం చేశారు. ఇదే వ్యవహారంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా 15 మంది ఆయన అనుచరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఇప్పటికే రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు.

కౌశిక్‌రెడ్డితోపాటు గచ్చిబౌలి పోలీసులు సైతం ఎమ్మెల్యే గాంధీ, అతడి అనుచరులపై ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని గచ్చిబౌలి ఎస్సై మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెండు వేర్వేరు ఫిర్యాదులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే గాంధీ సహా 15 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గాంధీ అనుచరులు ఉప్పలపాటి శ్రీకాంత్, గౌతమ్‌గౌడ్, రాంపల్లి వెంకటేశ్, రాములు, నరేశ్, మేల శివ, రాధిక, మంజుల, చంద్రికగౌడ్, రంగం నాగేందర్ యాదవ్, వెంకటేశ్ గౌడ్, అశ్రఫ్, రఘునాథ్‌రెడ్డి, మోహన్‌గౌడ్ తదితరులపై 109(1), 189, 191(2), 191(3), 132, 329, 333, 324(4), 324(5), 351(2), రెడ్‌విత్ 190 బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News