బీహార్ ఘటనపై అసదుద్దీన్ ఆగ్రహం
మన తెలంగాణ / హైదరాబాద్ : బీహార్‌లో కరెంటు కోతలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడాన్ని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. పోలీసులు కాల్పుల్లో మహ్మద్ ఖుర్షీద్, సోనూ సాహ్ మృతి చెందగా, నియాజ్ తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. మృతులు ఖుర్షీద్, సోనూ సాహ్ కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఓవైసి అన్నారు. నియాజ్‌కి అల్లా స్వస్థత చేకూర్చాలని, అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
Also read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)
ఈ ఘటను హేయమైందని, సిగ్గుచేటైన ఘటన అని తెలిపారు. ఇందుకు కారణమైన బీహార్ పోలీసులపై చర్య తీసుకోవాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, తేజస్వీ యాదవ్ దీనిని సమర్థించడం దారణమన్నారు. పేద ప్రజలు విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచాలని కోరితే, వారిపై కాల్పులు జరుపుతారా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల సామాజిక న్యాయం, ‘లౌకికవాదం‘ ఎలా సాధిస్తారని నిలదీశారు. , బిజెపిని ఇలా ఓడిస్తారా అని ఒవైసి ప్రశ్నల వర్షం కురిపించారు.