Monday, December 23, 2024

రాజస్థాన్ ముఠాపై పోలీసుల కాల్పులు

- Advertisement -
- Advertisement -

ఇందల్‌వాయి : నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల బారీగేట్‌ను గుద్దేసి వెళ్లిన దొంగలు కొద్ది దూరంలోనే కారును వదిలేసి పారిపోయారు. పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలింపులు జరుపుతున్నారు.జిల్లాలో గత కొద్ది కాలంగా రాత్రి సమయాల్లో పంట పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్‌ను ఎత్తుకెళ్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రాజస్థానీ రిజిస్ట్రేషన్ కారులో తిరుగుతూ ఈ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులు నిర్దారణకు వచ్చారు.ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు కొద్దిరోజులుగా వేచి చూస్తున్నారు.

సోమవారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాంతంలో రాజస్థానీ రిజిస్ట్రేషన్ ఉన్న తెల్ల కారు ముప్కాల్ జాతీయ రహదారి మీదుగా డిచ్‌పల్లివైపు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన డిచ్‌పల్లి పోలీసులు ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద బ్యారీకేడ్లు పెట్టి తనిఖీలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రిజిస్ట్రేషన్ ఉన్న తెల్ల కారు వేగంగా వచ్చింది. బ్యారీకేడ్లను ఢీకొట్టి పోలీసులపైకి దూసుకెళ్లింది. ఊహించని పరిణామంతో షాకునుంచి తెరుకున్నారు.ధర్‌పల్లి ఎస్సై తన సర్వీసు రివాల్వర్‌తో దొంగలు ఉన్న కారుపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అయినప్పటికి దొంగలు ఆగకుండా పారిపోయారు. బాన్సువాడ ఎక్స్ రోడ్ వద్ద కారును వదిలేసిన దొంగలు పారిపోయారు. దీంతో పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకొని విస్తృతంగా చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News